మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

భయపెడుతున్న సన్నీ లియోన్... (Video)

బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ భయపెడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకదాన్ని పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లో లక్షలాది మంది ఈ వీడియోను తిలకించారు. తన తదుపరి ప్రాజెక్టుగా హారర్ చిత

బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ భయపెడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకదాన్ని పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లో లక్షలాది మంది ఈ వీడియోను తిలకించారు. తన తదుపరి ప్రాజెక్టుగా హారర్ చిత్రంలో ఆమె నటించనుంది.
 
ఈ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతూ ప్రోస్థటిక్స్ (కృత్రిమ ఆకృతి)ను తన ముఖంపై వేసుకున్న చిత్రాలను అభిమానులతో పంచుకున్న సన్నీలియోనీ, తాజాగా, కృత్రిమ చర్మాన్ని తొలగిస్తున్న వేళ, రక్తమోడుతున్నట్టు కనిపిస్తున్న ఓ భయానక వీడియోను పోస్టు చేసింది. 
36 ఏళ్ల వయసులోనూ కుర్రకారు మతిపోగొడుతున్న సన్నీ, ఓ చిన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టగా అది గంటల వ్యవధిలోనే 2 లక్షల మందికి చేరి వైరల్ అయింది. ఇటువంటి కృత్రిమ చర్మాన్ని ధరిచడం తనకు ఫన్నీగా ఉందని వ్యాఖ్యానించింది. 
 
 
 
 

Haha having fun on set with the prosthetic kit. So gross but so much fun!!

A post shared by Sunny Leone (@sunnyleone) on