1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (15:34 IST)

చెమట వాసనను తొలగించుకోవాలంటే.. బిల్వ ఆకుల్ని నూరి..

చెమట వాసన వేధిస్తుందా? దుర్గంధంతో అందరితో కలిసి మెలసి వుండలేకపోతున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి. బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగి

చెమట వాసన వేధిస్తుందా? దుర్గంధంతో అందరితో కలిసి మెలసి వుండలేకపోతున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి. బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగించుకోవచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టును ముఖానికి రాసుకోవాలి. రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి. ఇక జుట్టు మృదువుగా మారాలంటే.. కరివేపాకు, గోరింటాకు పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్‌, ఉసిరిపొడి తీసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి టీ ఆకు, బీట్ రూట్ తరుగు వేసి కాచిన నీటిని కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారు చేసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి తలకు అంటే జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.