శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (15:10 IST)

పిల్లల్లో పోషకాహార లేమిని పోగొట్టడం ఎలా?

పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బరువు, ఎత్తుకు తగినట్లు ఆహారం ఇస్తూ వుండాలి. బరువు, ఎత్తును బట్టి ఆహారం అందించాలి. రోజువారీ ఆహారంలో కూరగాయలు,

పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బరువు, ఎత్తుకు తగినట్లు ఆహారం ఇస్తూ వుండాలి. బరువు, ఎత్తును బట్టి ఆహారం అందించాలి. రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, చేపలు, కోడిగుడ్లు, బీన్స్, మాంసం, నట్స్, సీడ్స్ వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి చిన్నారుల్లో పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.  
 
పోషకాహార లేమిని దూరం చేయాలంటే? 
పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వకూడదు. తద్వారా మల్టీ విటమిన్స్ వారికి అందకుండాపోతాయి. అందుకే ఆహారంలో అన్నీ పదార్థాలను వారికి తినిపించడం అలవాటు చేయాలి. అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా వంటి దేశాల్లో పిల్లల్లో పోషకాహార లేమిని తరిమికొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 
 
ఆహారం సరిగ్గా తీసుకోని పిల్లలకు ఓరల్ న్యూట్రీషనల్ సప్లిమెంట్ (Oral Nutritional Supplement)ను అందిస్తున్నారు. వీటిలో పిల్లల పెరుగుదలకు ఆవశ్యమైన విటమిన్లు, ధాతువులు, కొవ్వు, అమినోయాసిడ్లు లభిస్తాయి. తద్వారా పిల్లల్లో పోషకాహార లేమిని దూరం చేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిల్లల పోషకాహారంపై అవగాహన కల్పించే అవకాశాలు తక్కువగా వున్నాయని.. అందుకే వైద్యుల సలహా మేరకు పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.