శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (16:48 IST)

చిన్న పనిచేసినా క్లాప్స్‌తో ప్రోత్సహించండి.. కోపాన్ని పక్కనబెట్టండి..

మూడీ పిల్లలుంటే వారిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాలి. పెద్దల పట్ల గౌరవంగా ప్రవర్తించేలా చూడాలి. చదువుతో పాటు పద్ధతిగా పెంచాలి. తప్పు చేస్తే సారీ చెప్పాలి. ఇతరులకు సహకరించేలా ప్రవర్తించాలి. ఇంటి శుభ్ర

మూడీ పిల్లలుంటే వారిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాలి. పెద్దల పట్ల గౌరవంగా ప్రవర్తించేలా చూడాలి. చదువుతో పాటు పద్ధతిగా పెంచాలి. తప్పు చేస్తే సారీ చెప్పాలి. ఇతరులకు సహకరించేలా ప్రవర్తించాలి. ఇంటి శుభ్రత, గార్డెనింగ్‌లో పిల్లలు పాలుపంచుకోవాలి. సాయంత్రం పూట ఆటకు తర్వాత స్నానం చేసి ఆరోగ్య కరమైన స్నాక్స్ తినిపించాలి.

ఇరుగుపొరుగింటి వారితో, స్నేహితులతో, బంధువులతో ఎలా ప్రవర్తించాలో నేర్పాలి. పాఠశాలల్లో పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలి. ఉపాధ్యాయులంటే గౌరవమిచ్చే భావన పిల్లల్లో కల్పించాలి. 
 
పిల్లల్ని ఆప్యాయత కౌగిలించుకుని.. ముద్దిచ్చి స్కూలుకు పంపాలి. భావాలను సులభంగా వెలిబుచ్చేలా వారిని పెంచాలి. ఇతరులను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పాలి. అప్పుడే మీరు ఉత్తమ తల్లిదండ్రులు అవుతారు. పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకోవడం చేయకూడదు. వారి ముందు తరచూ గొడవకు దిగకూడదు. పిల్లల ముందు గొడవకు దిగితే వారు మానసికంగా బాధపడతారు.  
 
చిన్న పని చేసినా క్లాప్స్‌తో ప్రోత్సహించండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. అప్పుడే పిల్లల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కనబెట్టాలి. తిట్టడం, కొట్టడం చేయకూడదు. పిల్లల ఎదుగుదలకు ఆర్థికంగా నిలదొక్కుకుని.. డబ్బు ఆవశ్యకతను కూడా వారికి తెలియజేయాలి.

ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో వారికి తెలియజేయాలి. మీ పిల్లల గురించి ఇతరులు చాడీలు చెప్పినా.. పిల్లలతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. ఇతరుల మాటలను నమ్మి పిల్లలపై చిర్రుబుర్రులాడటం చేయకూడదు. 
 
ఇంట్లోని పెద్దలతో పిల్లల ఆడుకునేలా చేయండి. వారు చేసే ప్రతి విషయాన్ని ప్రోత్సహించండి. బొమ్మలతో, ఇంట్లోని పెద్దలతో ఆడుకునేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచాలి. స్కూలు నుంచి వచ్చాక అరగంట పాటు పిల్లల్లి ఫ్రీగా వదలాలి.

ఆ తర్వాత స్కూలు సంగతులేంటని అడిగి తెలుసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.