రన్‌వేపై జారిన విమానం.. ముక్కు భాగం టైర్ పగిలింది
కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే ట్రాక్‌పై నుంచి పక్క
కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే ట్రాక్‌పై నుంచి పక్కకు దిగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు.
అబుదాబి నుంచి కొచ్చికి వచ్చిన ఎయిరిండియా విమానం ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానం పార్కింగ్ ఏరియాకు వస్తుండగా, రన్‌వే ట్రాక్ నుంచి పక్కకు తప్పుకుంది. మంగళవారం వేకువజామున 2.40 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది.
ఆ సమయంలో విమానాశ్రయ ప్రాంతంలో వర్షం పడుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే నిచ్చెన సాయంతో ప్రయాణికులు విమానం దిగారు. బోయింగ్ 373-800 విమానానికి చెందిన ముక్కు భాగం టైర్ పగిలిపోయినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు విచారణకు ఆదేశించారు.