మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (10:15 IST)

వామ్మో.. షికాగో హోటలా వద్దు బాబోయ్.. దెయ్యాలుంటాయ్.. ఎయిరిండియా సిబ్బంది హడల్

ఎయిరిండియా సంస్థ తమ సిబ్బందికి షికాగోలోని ఒక స్టార్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. అయితే అమెరికాలోని షికాగో వెళ్లే ఎయిరిండియా సిబ్బంది మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ స్టార్ హోటల్‌లో

ఎయిరిండియా సంస్థ తమ సిబ్బందికి షికాగోలోని ఒక స్టార్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. అయితే అమెరికాలోని షికాగో వెళ్లే ఎయిరిండియా సిబ్బంది మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ స్టార్ హోటల్‌లో దెయ్యాలున్నాయట. ఆ హోటల్‌లో దెయ్యాల భయంతో తాము బసచేయమని ఎయిరిండియా సిబ్బంది తెగేసి చెప్తున్నారు. ఆ హోటల్‌లో అడుగుపెట్టగానే వింత శబ్దాలు వినిపిస్తున్నాయని సిబ్బంది అంటున్నారు. 
 
అంతేగాకుండా.. కళ్ల ముందు దెయ్యం నీడలు, హోటల్ రూమ్‌లో కిటికీలు, తలుపులు ఊగుతూ వుంటాయని ఎయిరిండియా సిబ్బంది అంటున్నారు. దీంతో ఆ హోటల్‌‌లో బస చేసేందుకు ఎయిరిండియా సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. హోటల్‌లో పారానార్మల్ యాక్టివిటీ తరహాలో సంఘటనలు చోటుచేసుకుంటాయని, వారి ప్రవర్తనలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని.. విచారణ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.