సోమవారం, 8 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (17:07 IST)

Varun Sandesh : కానిస్టేబుల్ విడుదలవుతుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి : వరుణ్ సందేశ్

Varun Sandesh, Arjun, Karthik Raju and others
Varun Sandesh, Arjun, Karthik Raju and others
"నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం హ్యాపీడేస్ 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.. అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.
 
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు. 
 
నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు. 
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు. 
 
ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్, కార్తీక్ రాజు, విశ్వ కార్తికేయ, ఇంకా సునామీ సుధాకర్, దువ్వాసి మోహన్, కెమెరామెన్ హజరత్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, సహ నిర్మాతలు నికిత జగదీష్, కుపేంద్ర పవర్, ఇతర యూనిట్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు. 
 
 ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో  దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం. 
 
 ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, బి.జి.ఎం.:గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య, సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం;: ఆర్యన్ సుభాన్ .ఎస్.కె.