గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (15:19 IST)

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Mana Shankara Vara Prasad garu new poster
Mana Shankara Vara Prasad garu new poster
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రం. ఈసినిమాకు ముందే అనిల్ డేట్స్ చిరంజీవికి వున్నా సాంకేతిక కారణాలవల్ల సెట్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే, చిరంజీవిని నలభై ఏళ్ళ వాడిగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దానితోపాటు విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారు. 
 
స్పెషల్ ఏమంటే ఇద్దరిపై ఎంటర్ టైన్ మెంట్ లో కొన్ని సన్నివేశాలు హిలేరియస్ వినోదాన్ని అందించే సీన్స్ రాశారట. అందుకు తగిన విధంగా వీరిపై షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇది మంచి హైలైట్ గా సినిమాలో నిలవనుందని తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఏరికోరి సంగీత దర్శకుడు భీమ్స్ ను చిరంజీవి తీసుకున్నారు. అప్పటికే ఆయన సినిమాలు ఆదరణ పొందాయి. సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రాబోతుంది.