స్వైన్ ఫ్లూ టీకా జలుబు, దగ్గు వుంటే వేసుకోవచ్చా?
స్వైన్ ఫ్లూ వచ్చాక బాధపడే కంటే ఫ్లూ లక్షణాలు కనబడితేనే టీకా వేయించుకోవడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ టీకాను అసలు తీసుకోకూడదు. సాధారణ ఆరో
స్వైన్ ఫ్లూ వచ్చాక బాధపడే కంటే ఫ్లూ లక్షణాలు కనబడితేనే టీకా వేయించుకోవడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ టీకాను అసలు తీసుకోకూడదు. సాధారణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తీసుకోవాలి.
ఆరేళ్లలోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, వైద్యసిబ్బంది కచ్చితంగా టీకా తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దగ్గినపుడు, తుమ్మినపుడు నోటికి, ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కుకు, నోటికి మాస్క్ ధరించాలి. కనీసం రుమాలునైనా చుట్టుకోవాలి. ఫ్లూ లక్షణాలున్నవారితో చేతులు కలపటం, ఆలింగనం చేసుకోవడం వంటివి చేయకూడదు.
దగ్గేవారికి, తుమ్మేవారికి కాస్త దూరంగా ఉండటం మేలు. స్వైన్‌ఫ్లూ రాకుండా చూసుకోవటానికి ఇప్పుడు టీకా కూడా అందుబాటులో ఉంది. ఇది మిగతా ఫ్లూ వైరస్‌ల నుంచీ రక్షణ కల్పిస్తుంది. అయితే జబ్బు వచ్చాక ఈ టీకా తీసుకుంటే ప్రయోజనం వుండదు.