శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (09:11 IST)

హీరో దంపతులకు స్వైన్ ఫ్లూ... సీక్రెట్‌గా ఇంట్లోనే చికిత్స?

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఖాన్ త్రయంలో ఒకరిగా గుర్తింపు పొందిన హీరో అమీర్ ఖాన్. ఈయన భార్య కిరణ్ రావు. వీరిద్దరూ హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్ ఫ్లూ) బారినపడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ ఆస్పత్రిలో చేరకుండా

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఖాన్ త్రయంలో ఒకరిగా గుర్తింపు పొందిన హీరో అమీర్ ఖాన్. ఈయన భార్య కిరణ్ రావు. వీరిద్దరూ హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్ ఫ్లూ) బారినపడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్టు బాలీవుడ్ వర్గా సమాచారం.
 
ఆదివారం తమ స్వచ్ఛంద సంస్థ పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూణేలో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ దంపతులు హాజరుకావాల్సి ఉంది. అయితే స్వైన్‌ఫ్లూ కారణంగా తాము రాలేకపోతున్నామని అమీర్ నిర్వాహకులకు తెలిపినట్టు వార్తలు వెలువడ్డాయి.
 
రక్తపరీక్షల అనంతరం స్వైన్‌ఫ్లూ సోకినట్లు గుర్తించారని, వారం రోజులుగా ఆమిర్ దంపతులు ఏ కార్యక్రమానికీ హాజరుకావడంలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే పానీ ఫౌండేషన్ వార్షిక కార్యక్రమానికి అమీర్ గైర్హాజరైనప్పటికీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించారు.