శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (11:56 IST)

నిద్రలేమికి కారణాలేంటి? ఉపశమనం పొందే మార్గాలేంటి?

ఇపుడు నగర వాసుల్లోనేకాకుండా గ్రామీణ ప్రజల్లో సైతం నిద్రలేమి సమస్య కనిపిస్తోంది. రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే ఉదయానికి కాళ్లు, చేతులు తిమ్మిరి ఎక్కినట్టు, నిద్ర లేకపోతే బీపీ, ఒత్తిడి పెరుగుతుంది. గుండె

ఇపుడు నగర వాసుల్లోనేకాకుండా గ్రామీణ ప్రజల్లో సైతం నిద్రలేమి సమస్య కనిపిస్తోంది. రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే ఉదయానికి కాళ్లు, చేతులు తిమ్మిరి ఎక్కినట్టు, నిద్ర లేకపోతే బీపీ, ఒత్తిడి పెరుగుతుంది. గుండె స్పందనల్లో తేడాలు కనిపిస్తాయి. మధుమేహం నియంత్రణలోకి రాకపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. 
 
అయితే, అసలు నిద్రలేమికి కారణాలను పరిశీలిస్తే.. అధిక బరువు ఉండటం. తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కోవడం. టీవీలు చూడడం, సెల్‌ఫోన్‌ మాట్లాడటం. టీ, కాఫీ, మద్యం, సిగరెట్లు విపరీతంగా తాగడం. రాత్రి పూట ఉద్యోగాలు చేయడం వంటి వాటివల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. 
 
ఈ నిద్రలేమి సమస్య వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. వీటిలో మానసికంగా చిరాకుగా ఉండటం, చేసే పనిమీద ధ్యాస లేకపోవడం,  ఆందోళన, ఆతృత, ఒత్తిడి పెరగడం, భయం, భయంగా ఉండటం, బీపీ పెరగడం, గుండె స్పందనలో మార్పులు, నరాల్లో బలహీనత, వణకడం, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వంటివి సమస్యలు ఏర్పడతాయి. 
 
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు.. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే స్నానం చేయాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించాలి. టీ, కాఫీ, మద్యం, సిగరెట్‌ అలవాట్లకు దూరంగా ఉండాలి. 9 గంటల తర్వాత టీవీ చూడడం మానేయాలి. సెల్‌ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడవద్దు. సెల్‌ రింగ్‌టోన్‌ చాలా సన్నగా వినిపించే విధంగా పెట్టుకోవాలి. ప్రతి రోజూ తప్పని సరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టయితే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.