మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By chj
Last Modified: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (18:08 IST)

చికెన్ లాలీ పాప్స్... మీరే తయారు చేయొచ్చు టేస్టీగా...

చికెన్ లాలీ పాప్స్ చాలామంది ఏదో హోటల్లో కొనుక్కుంటారు కానీ అవి మనమే చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇంతకీ వాటిని ఎవా తయారు చేయాలో చూద్దాం. కావల్సినవి... చికెన్ కీమా 3 కప్పులు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 1, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా అర టేబుల్ స్పూన్

చికెన్ లాలీ పాప్స్ చాలామంది ఏదో హోటల్లో కొనుక్కుంటారు కానీ అవి మనమే చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇంతకీ వాటిని ఎవా తయారు చేయాలో చూద్దాం. కావల్సినవి... చికెన్ కీమా 3 కప్పులు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 1, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా అర టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, ఫిస్ సాస్ 2 టేబుల్ స్పూన్స్, టమోటా సాస్ 4 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 2 రెమ్మలు, గుడ్లు 2(పచ్చసొన మాత్రమే). మొక్కజొన్న పిండి పావుకప్పు, మైదా పిండి పావుకప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, హాట్ వాటర్ వేడి చేసుకునేందుకు సరిపడినంత...
 
తయారీ... ముందుగా చికెన్ కీమాను మిక్సీ చేసుకోవాలి. తర్వాత మసాలా, సోయా సాస్, ఫిష్ సాస్, టమోటా సాస్ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర అల్లం పేస్టు లేదా అల్లం ముక్క వేసుకుని మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో గుడ్డు యాడ్ చేసుకుని బాగా కలపాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, మైదా పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 
 
ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకుని అందులో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకుని పొడవుగా చుట్టుకుని చాక్లెట్లా రెండు చివర్లలో మెలిపెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మరుగుతున్న నీట్లో వేసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సిల్వర్ ఫాయిల్ పేపర్ నుంచి చికెన్ బన్‌ను బయటకు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే రుచికరమైన చికెన్ లాలీ పప్స్ సిద్ధమవుతాయి.