రూ.999లకే 4జీ స్మార్ట్ ఫోన్.. మైక్రోమ్యాక్స్ సరికొత్త స్కీమ్..

మైక్రోమ్యాక్స్ రూ.999కే స్మార్ట్ ఫోన్ లభించేలా సరికొత్త స్కీమ్‌ను ప్రకటించింది. తాము విడుదల చేసిన ''భారత్ 2 అల్ట్రా'' ఫోన్ ధర రూ. 2,899 కాగా, దీన్ని వాడి రూ. 1,900 రీఫండ్ పొందవచ్చని మైక్రోమ్యాక్స్ పేర

selvi| Last Updated: మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:18 IST)
మైక్రోమ్యాక్స్ రూ.999కే స్మార్ట్ ఫోన్ లభించేలా సరికొత్త స్కీమ్‌ను ప్రకటించింది. తాము విడుదల చేసిన ''భారత్ 2 అల్ట్రా'' ఫోన్ ధర రూ. 2,899 కాగా, దీన్ని వాడి రూ. 1,900 రీఫండ్ పొందవచ్చని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. ఇందుకోసం కస్టమర్లు వోడాఫోన్ సిమ్‌ను వాడాల్సి వుంటుందని తెలిపింది.

తొలి ఏడాదిన్నర తరువాత రూ.900, ఆపై మరో ఏడాదిన్నర తరువాత రూ. 1000 క్యాష్ బ్యాక్ అవుతుందని, దీంతో రూ. 2,899కి కొన్న ఫోన్ రూ. 999కే వచ్చినట్టు అవుతుందని సంస్థ వెల్లడించింది. ఈ సౌకర్యం పొందడానికి ప్రతినెలా కనీసం రూ. 150తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది.

ఇక భారత్ 2 అల్ట్రా ఫీచర్ల సంగతికి వస్తే...
ఇందులో 4జీబీ మెమరీ,
512 జీబీ మెమరీ,
512 ఎంబీ ర్యామ్
4 అంగుళాల టచ్ స్క్రీన్
1,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తదితర సదుపాయాలున్నాయి.దీనిపై మరింత చదవండి :