శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (17:22 IST)

ఫ్లిఫ్ కార్టులో రూ.999లకు మోటో ఇ4 ప్లస్..

ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిఫ్ కార్ట్ రూ.999లకే మోటో ఇ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను ఆఫర్ ప్రైజ్‌లో వినియోగదారులకు అందించనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఈ ఫోనును రూ.999లకు గురువారం మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మ

ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిఫ్ కార్ట్ రూ.999లకే మోటో ఇ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను ఆఫర్ ప్రైజ్‌లో వినియోగదారులకు అందించనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఈ ఫోనును రూ.999లకు గురువారం మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మోటోరోలా సంస్థకు చెందిన మోటో ఇ4 స్మార్ట్ ఫోన్.. భారత్‌ మార్కెట్లోకి విడుదలైన గంటల్లోనే ఫ్లిఫ్ కార్ట్ విక్రయాలను మొదలెట్టింది.

అమేజాన్ తరహాలో ఫ్లిఫ్ కార్ట్ కూడా కస్టమర్లకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్న వేళ మోటో ఇ4 స్మార్ట్ ఫోన్.. రూ.999లకే ఆఫర్ ప్రైజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.9,999. ప్రస్తుతం ఈ ఫోనుకు రూ.9000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదనంగా రూ.4000ల వరకు పే-బ్యాక్ గ్యారెంటీ లభిస్తుంది. 
 
మోటో ఇ4 ఫీచర్స్ 
3జీబీ రామ్, 
32 జీబీ ఇంటర్నెల్ మెమొరీ
5.5 ఇంచ్‌ల హెచ్డీ డిస్‌ప్లే
13ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా.