మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (09:29 IST)

స్మిత్‌కు ఘోర అవమానం.. నేరస్తుడిని లాక్కెళ్లినట్టుగా...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఘోర అవమానం జరిగింది. తమ క్రికెట్ జట్టు పరువును నిలువునా తీసినందుకు ఆస్ట్రేలియా పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఘోర అవమానం జరిగింది. తమ క్రికెట్ జట్టు పరువును నిలువునా తీసినందుకు ఆస్ట్రేలియా పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. జోహన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో ఆయన్ను నేరస్తుడిని లాక్కెళ్లినట్టుగా చేతులు పట్టుకుని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. దీంతో ఆ దేశ పరువు పోయింది. జట్టు సహచరులు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడేందుకు తన వంతు సహకారం అందించినందుకుగాను కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఒక యేడాది నిషేధం విధించారు. 
 
దీంతో ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న ఆయన, తిరిగి స్వదేశానికి బయలుదేరారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణికులు, క్రికెట్ అభిమానులు స్మిత్‌ను చూడగానే 'చీట్', 'చీటర్', 'చీటింగ్' అంటూ హేళనగా మాట్లాడారు. 
 
ఇదేసమయంలో స్మిత్‌కు రక్షణగా వచ్చిన పోలీసులు సైతం ఆయనపై ఏ విధమైన గౌరవం లేకుండా ప్రవర్తించారు. ఏదో మొక్కుబడిగా పక్కన ఉండి, దాదాపు నేరస్తుడిని లాక్కెళ్లినట్టుగా లాక్కెళ్లారు. ఎస్కలేటర్ ఎక్కనీయకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టగా స్మిత్‌పై పలువురు సానుభూతిని చూపుతున్నారు.