శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (17:06 IST)

పింక్ డ్రెస్సే దక్షిణాఫ్రికా విజయానికి కారణమా? సోషల్ మీడియాలో వైరల్

భారత్‌తో శనివారం జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వరుణుడు ఈ మ్యాచ్‌ను అడ్డుకున్నా భారత్ పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుచ

భారత్‌తో శనివారం జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వరుణుడు ఈ మ్యాచ్‌ను అడ్డుకున్నా భారత్ పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుచుకున్న భారత్.. నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఏడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా ముందు 290 పరుగుల లక్ష్యాన్ని ఉంచినప్పటికీ, వర్షం కారణంగా ఆటకు బ్రేక్ వచ్చింది. 
 
డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 28 ఓవర్లకు 202 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచారు. కేవలం 25.3 ఓవర్లలోనే సౌతాఫ్రికా 207 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే ఈ విజయంపై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే దిశగా.. ప్రతి సంవత్సరం ఓ మ్యాచ్‌ను గులాబీ రంగు దుస్తుల్లో దక్షిణాఫ్రికా ఆడుతుంది. 
 
ఈ డ్రెస్‌లో ఆడితే దక్షిణాఫ్రికా ఓడిపోదు. ఈ డ్రస్సు వల్లే దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇది రికార్డు పరంగా నిజమేనని క్రీడా పండితులు కూడా చెప్తున్నారు. ఈ మ్యాచ్‌తో కలిపి మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా పింక్ జర్సీలతో ఆడిన, అన్ని మ్యాచ్‌లను సొంతం చేసుకుంది.