1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:02 IST)

సఫారీలను చితక్కొట్టిన విరాట్ కోహ్లీ : మూడో వన్డేలో విజయభేరీ

సఫారీ గడ్డపై భారత క్రికెటర్లు సింహాల్లో గర్జిస్తున్నారు. ఆతిథ్య జట్టును మట్టికరిపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు వన్డే మ్యాచ్‌లలో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. బుధవారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన థ

సఫారీ గడ్డపై భారత క్రికెటర్లు సింహాల్లో గర్జిస్తున్నారు. ఆతిథ్య జట్టును మట్టికరిపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు వన్డే మ్యాచ్‌లలో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. బుధవారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన థర్డ్ మ్యాచ్‌లోనూ ఏకంగా 124 పరుగుల విజయలక్ష్యంతో గెలిచి, ఆరు వన్డే మ్యాచ్‌లో సిరీస్‌ను 3-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 160 నాటౌట్‌) భారీ శతకం, ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (63 బంతుల్లో 12 ఫోర్లతో 76) మెరుపులు మెరిపించాడు. మ్యాచ్ తొలి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ.. కోహ్లీ విజృంభణతో భారత్ భారీ స్కోరు చేసింది. రహానే 11, హార్దిక్ 14, ధోనీ 10, కేదార్ 1, భువనేశ్వర్ 16 చొప్పున పరుగులు చేయగా, అదనంగా 15 పరుగులు వచ్చాయి. 
 
అనంతరం 304 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 40 ఓవర్లలో 179 పరుగులకే చాపచుట్టేశారు. సఫారీ బ్యాట్స్‌మెన్లలో డుమిని (51) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ (4/23), చాహల్‌ (4/46)తో పాటు బుమ్రా (2/32) సత్తా చాటారు. ఫలితంగా ఆతిథ్య జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే మ్యాచ్ ఈనెల 10వ తేదీన జరుగనుంది. ఈ మ్యాచ్‌లోగాని భారత్ గెలుపొందినట్టయితే సఫారీ గడ్డపై 1992-93 సంవత్సరం తర్వాత వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న జట్టుగా కోహ్లీ సేన అవతరించనుంది.