బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:24 IST)

విశాఖలో మూడో వన్డే.. ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. లంక గట్టెక్కేనా?

విశాఖ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో సమఉజ్జీవులుగా ఉన్న ఇరు జట్లు, ఈ వన్డేలో విజయం దిశగా పోటీపడనున్నాయి. తొలి

విశాఖ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో సమఉజ్జీవులుగా ఉన్న ఇరు జట్లు, ఈ వన్డేలో విజయం దిశగా పోటీపడనున్నాయి. తొలి ధర్మశాల వన్డేలో భారత్ ఓడిపోగా, మొహాలీ వేదికగా జరిగిన  రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇక విశాఖలో జరిగే మూడో వన్డేలో లంక, భారత్‌లలో ఏ జట్టును విజయం వరిస్తుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
ఇకపోతే.. చాలాకాలంగా భారత గడ్డపై టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయిన లంకేయులు.. ఇప్పటివరకూ తొమ్మిది వన్డే సిరీస్‌ల్లో తలపడ్డారు. ఒక్క సిరీస్ డ్రా చేసుకోవడం మినహా.. ప్రతీసారీ లంకకు ఓటమి తప్పలేదు. ఇటీవలే తమ దేశంలో కూడా టీమిండియా చేతిలో 0-5తో చిత్తుగా ఓడిన ఆ జట్టు.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో గెలుపును అందుకుంది. 
 
రెండో వన్డేలో భారత్‌ విజయం సాధించి లెక్కను సరిచేసింది. ఇదిలా ఉంచితే, గత ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిల్లోనూ విజేతగా నిలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. ఈ క్రమంలోనే సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా, లంక కూడా భారత్‌పై గెలిచి కొత్త రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.