ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (17:03 IST)

విరాట్ కోహ్లీ-అనుష్క దంపతుల కొత్త సంవత్సర శుభాకాంక్షలు

బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను వివాహమాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో వున్నాడు. తాజాగా కోహ్లీ తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి నృత్యం చేసి మరోసారి వార్తల్లోకెక్

బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను వివాహమాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో వున్నాడు. తాజాగా కోహ్లీ తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి నృత్యం చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వీధుల్లో తిరిగిన విరాట్ కోహ్లీ తోటి క్రీడాకారుడు శిఖర్ ధావన్‌తో కలిసి భాంగ్రా నృత్యం చేసి సందడి చేశారు. 
 
కోహ్లీ, శిఖర్ ధావన్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ, అనుష్క, శిఖర్ ధావన్, ఆయేషా దంపతులు దక్షిణాఫ్రికా వీధుల్లో తిరిగిన వీడియో క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా చేరుకున్న టీమిండియా జట్టుకు దక్షిణాఫ్రికా సాదరంగా స్వాగతించింది. ముఖ్యంగా నవ దంపతులు విరాట్, అనుష్కల రాకపై అధిక శ్రద్ధ తీసుకుంది. 
 
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కోహ్లీ, అనుష్క శర్మ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇకపోతే కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని అనుష్క, కోహ్లీ జంట కేప్ టౌన్ నుంచి ఫ్యాన్స్‌తో అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. ఇందుకు తోడుగా ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.