శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:00 IST)

నేను పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు.. పేస్ బౌలర్‌ని అభినందించా: ద్రవిడ్

అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా యువ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టుకు ద్రవిడ్ కోచ్ కావడంతో ఆయనపై క్రికెట్ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్ -19 ప్రపంచ కప్ సె

అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా యువ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టుకు ద్రవిడ్ కోచ్ కావడంతో ఆయనపై క్రికెట్ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్ -19 ప్రపంచ కప్ సెమీఫైనల్లో గెలుపుకు అనంతరం రాహుల్ ద్రవిడ్ పాకిస్థాన్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్లు వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. 
 
తనపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. కివీస్ నుంచి భారత్ చేరుకున్న రాహుల్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలని పాక్ జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ ఆహ్వానించాడని.. ఆయన కోరికను మన్నించి తాను వారి వద్దకు వెళ్లి మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. 
 
తాను పాక్ కుర్రాళ్లతో మాట్లాడలేదని, అయితే పాక్ ఆటగాళ్లలో ఓ ఎడమచేతి వాటం పేస్ బౌలర్‌ను అభినందించానని.. అది కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో కానే కాదన్నాడు. అదేవిధంగా పాక్ కోచ్ సైతం భారత ఆటగాళ్లను అభినందించాడని గుర్తు చేశారు.