సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (15:50 IST)

పేపరూపెన్నూ ఉందని నిరాధారపూరిత వార్తలు రాయొద్దు : ద్రవిడ్

వచ్చే డిసెంబర్‌లో త‌న‌కు విశ్రాంతి కావాల‌ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిన‌ట్లు జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. పేపరూ పెన్నూ ఉందని నిరాధారపూర

వచ్చే డిసెంబర్‌లో త‌న‌కు విశ్రాంతి కావాల‌ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిన‌ట్లు జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. పేపరూ పెన్నూ ఉందని నిరాధారపూరిత వార్తలు రాయొద్దంటూ ఆయన కోరారు. 
 
ఈ యేడాది డిసెంబరు నెలలో త‌న‌కు విశ్రాంతి కావాల‌ని, శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని బీసీసీఐను కోహ్లీ కోరిన‌ట్లు వార్త‌లు వచ్చాయి. పైగా, డిసెంబ‌రులో కోహ్లీ త‌న ప్రియురాలు, అనుష్కను పెళ్లి చేసుకుంటున్నాడ‌ని కూడా ప్ర‌చారం సాగింది. అయితే, కోహ్లీ విశ్రాంతి కోరితే ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను బీసీసీఐ తిర‌స్క‌రించింద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
దీనిపై రాహుల్ స్పందిస్తూ, శ్రీలంకతో సిరీస్‌కు కోహ్లీ విశ్రాంతి కోరిన విషయం వాస్తవం కాదన్నారు. ప్రతి ఒక్కరికీ విశ్రాంతి అనేది అవసరమ‌ని తెలిపారు. ఆ క్రమంలో కోహ్లీకి విశ్రాంతి కావాలంటే తీసుకునే అవకాశం ఉందని, అంతేకానీ ఇటువంటి వార్త‌లు రావ‌డం బాధాకరమని వ్యాఖ్యానించారు.