శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (12:59 IST)

పాకిస్థాన్ మాజీ ప్రధానికి అరెస్టు వారెంట్‌ జారీ

పనామా గేట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జ

పనామా గేట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. 
 
తాజాగా లాహోర్‌ అవినీతి నిరోధక కోర్టు.. నవాజ్ షరీఫ్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. వచ్చే నెల మూడో తేదీన కోర్టులో హాజరుకావాలని నవాజ్‌ను ఆదేశించింది. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. నవాజ్‌ భార్య కుల్సుమ్‌ కొంతకాలంగా కేన్సర్‌‌కు లండన్‌లో చికిత్స తీసుకుంటోంది.