శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:35 IST)

ఆర్జీవీ అరెస్టుకు విజయవాడ కోర్టు ఆదేశం... ఏ క్షణమైనా...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వంగవీటి చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వంగవీటి చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. 
 
గతంలో దాసరి కిరణ్ నిర్మాతగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి చిత్రం వచ్చింది. ‘వంగవీటి’ సినిమాపై ఆదిలోనే వంగవీటి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆ సమయంలో తాను తీయదలచుకున్న సినిమాపై వారిని స్వయంగా కలుసుకుని వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణకు వంగవీటి కుటుంబ సభ్యులు సంతృప్తి చెందలేదు. 
 
దీంతో వంగవీటి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. వర్మ తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా, వాస్తవాలను వక్రీకరించి, ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపరిచారని రంగా తనయుడు రాధా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.