శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (13:29 IST)

శ్రీవల్లీలో ఆ నగ్న సన్నివేశాన్ని.. ఎలా చిత్రీకరించారో తెలుసా?

ఈ చిత్రంలో హీరోయిన్‌పై ఓ న్యూడ్ సీన్ వుందని.. ఆ సీన్ షాట్ చేసేటప్పుడు పురుషులెవ్వరూ ఆ ప్రాంతంలో లేమని.. హీరోయిన్‌కు ఆ సీన్ ఎలా తీయాలో నేర్పించామని.. కెమెరాను ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాక.. ఆ షాట్‌ను హ

బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాసి.. దర్శకత్వం వహించిన శ్రీవల్లీ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో రజత్ .. నేహా హింగే జంటగా నటించారు. సునీత నిర్మించారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి ముందుగానే రావాలనీ, మొదటి ఐదు నిమిషాలను ఎలాంటి పరిస్థితుల్లోను మిస్ కాకూడదని నిర్మాత అంటున్నారు. తొలి ఐదు నిమిషాల పాటు రాజమౌళి వాయిస్ ఓవర్ ఉంటుందని.. కీలకమైన ఆ వాయిస్ ఓవర్ వినడం చాలా ముఖ్యమన్నారు. 
 
ఇకపోతే.. ఈ చిత్రంలో హీరోయిన్‌పై ఓ న్యూడ్ సీన్ వుందని.. ఆ సీన్ షాట్ చేసేటప్పుడు పురుషులెవ్వరూ ఆ ప్రాంతంలో లేమని.. హీరోయిన్‌కు ఆ సీన్ ఎలా తీయాలో నేర్పించామని.. కెమెరాను ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాక.. ఆ షాట్‌ను హీరోయినే స్వయంగా తీసినట్లు రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. ఈ సీన్ చేసేటప్పుడు నిర్మాత సునీత మాత్రం హీరోయిన్‌తో ఉన్నారని  చెప్పుకొచ్చారు. ఈ సీన్ అభ్యంతరకరంగా వుండదని చెప్పారు.