శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (09:46 IST)

ఇటలీలో విరాట్ కోహ్లీ- అనుష్కల వివాహం: లీవులడిగిన కెప్టెన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ అధికారులను ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ రాసినట్టు సమాచారం. 
 
ఈ లీవుల్లో అనుష్క సైతం డిసెంబరులో ఎలాంటి షూటింగ్‌లకూ కాల్‌షీట్లు ఇవ్వట్లేదట. దీంతో బాలీవుడ్‌ వర్గాల్లోనూ అనుష్క పెళ్లి ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివరిలో విరాట్ అనుష్కలు పెళ్లి చేసుకోనున్నారని, అందుకే ఇద్దరూ కనీసం నెల రోజుల పాటు తమ రోజువారీ విధులకు దూరం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అనుష్క-కోహ్లీ జంట నోరు విప్పలేదు.