బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2017 (20:15 IST)

నన్ను నమ్మినందుకు నిర్మాత శాటిస్ఫై ఐతే చాలు.. అనుష్క

సినిమా విజయవంతమయితే నేను సంతోషం పడటం కంటే నిర్మాతకు ఆదాయం వచ్చి ఆయన సంతోషపడితేనే నాకు చాలా ఇష్టం. నేను సినిమాల్లో నటించడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిర్మాతను సంతోషపెట్టడమే నాకు ఇష్టం. నన్ను నమ్మి నాకు హీరోయిన్‌గా అవకాశమిచ్చి కోట్ల రూపాయలు

సినిమా విజయవంతమయితే నేను సంతోషం పడటం కంటే నిర్మాతకు ఆదాయం వచ్చి ఆయన సంతోషపడితేనే నాకు చాలా ఇష్టం. నేను సినిమాల్లో నటించడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిర్మాతను సంతోషపెట్టడమే నాకు ఇష్టం. నన్ను నమ్మి నాకు హీరోయిన్‌గా అవకాశమిచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నిర్మాత ఏ విధంగాను నష్టపోకూడదు. నాకు తెలిసింది అదే.
 
అంతే కాదు.. నేను అవార్డులు, రివార్డుల కోసమే సినిమాల్లో నటించాలని అనుకోను. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అని అభిమానులు పొగిడితే చాలు.. అబ్బా.. ఆమె చాలా బాగా నటిస్తుందని కితాబిస్తే చాలు అదే నాకు అవార్డులు, రివార్డులు అంటుంది పొడుగు సుందరి అనుష్క.