శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (22:06 IST)

ఇంకా నన్ను నటించమంటున్నారా... వదిలేసి ఐదేళ్లయింది... రిచా

రిచా గంగోపాధ్యాయ్ పేరు చెబితే వెంటనే రానా నటించిన లీడర్ చిత్రం గుర్తుకు వస్తుంది. అందులో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆమె మిర్చి, మిరపకాయ్, నాగవల్లి, భాయ్ చిత్రాల్లో నటించింది. 2013 సంవత్సరం నుంచి ఆమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.

కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారూ అని అడుగుతూనే వున్నారు. దీనిపై ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తను సినిమాలకు దూరమై ఐదేళ్లు కావస్తోందనీ, ఇంకా సినిమాల్లో ఎలా నటిస్తారని అనుకుంటున్నారంటూ ప్రశ్నాస్త్రం సంధించింది. తన జర్నీ కొత్త రూట్లో వెళ్తోందని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఎంబీఎ కోర్సు చేస్తోంది. మరి ఈ చదువు ముగిసిన తర్వాత ఆమె ప్లాన్ ఏమిటో...?