బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 21 అక్టోబరు 2017 (18:42 IST)

నేను సీనియర్ నటిని కాదంటే కోస్తానంటోందట తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నాకు అందంతో పాటు కాస్త పొగరు కూడా ఇచ్చినట్లున్నాడు దేవుడు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులు ఎవరని ఒక జాబితా తీస్తే అందులో తమన్నా పేరు కూడా ఉంది. 15 సంవత్సరాలకే సినిమా రంగంలోకి వచ్చిన తమన్నా ఇప్పుడు తాను సీనియర్ నటినని ఆ జాబితాను

మిల్కీ బ్యూటీ తమన్నాకు అందంతో పాటు కాస్త పొగరు కూడా ఇచ్చినట్లున్నాడు దేవుడు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులు ఎవరని ఒక జాబితా తీస్తే అందులో తమన్నా పేరు కూడా ఉంది. 15 సంవత్సరాలకే సినిమా రంగంలోకి వచ్చిన తమన్నా ఇప్పుడు తాను సీనియర్ నటినని ఆ జాబితాను చూసి ఆనంద పడిపోతోంది. అయితే కొంతమంది నువ్వేంటి సీనియర్ నటి అని హేళనగా మాట్లాడితే మాత్రం నాలుక కోస్తానంటూ తమాషాగా ఆటపట్టిస్తోందట.
 
ఇప్పటికీ తాను సీనియర్ నటినని చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవుతానని అంటోందట. తను చేసిన సినిమాలు అలాంటివి మరి. మంచి పేరుతో పాటు పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చాయంటూ తెగ ఆనందపడిపోతోందట. అప్పుడప్పుడూ అది చెప్పుకుంటూ ఆనంద బాష్పాలు కురిపిస్తోందట మిల్కీ బ్యూటీ. అయితే ఇంత పేరు వచ్చిన తరువాత ఆచితూచి అడుగులు వేయాలని కూడా చెబుతోంది. మరి బాహుబలి తర్వాత ఆ స్థాయిలో మెరుపులు మాత్రం మెరిపించలేకపోతోంది.