బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (17:55 IST)

మెర్సల్: రూ.150కోట్ల రికార్డును అధిగమిస్తుందా?

కోలీవుడ్ హీరో విజయ్ తాజా సినిమా మెర్సల్ రూ.150 కోట్ల మార్కు కలెక్షన్ల రికార్డుకు దూసుకెళ్తోంది. విడుదలైన రోజు నుంచి వసూళ్ల పరంగా ఈ సినిమా దుమ్ము రేపేస్తోంది. దేశవ్యాప్తంగా 4500 థియేటర్స్‌లో విడుదలైన ఈ

కోలీవుడ్ హీరో విజయ్ తాజా సినిమా మెర్సల్ రూ.150 కోట్ల మార్కు కలెక్షన్ల రికార్డుకు దూసుకెళ్తోంది. విడుదలైన రోజు నుంచి వసూళ్ల పరంగా ఈ సినిమా దుమ్ము రేపేస్తోంది. దేశవ్యాప్తంగా 4500 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా, తొలి రోజున రూ.43.3 కోట్లను వసూలు చేసింది. అదే విధంగా రెండో రోజు రూ.70కోట్లు, శనివారమైన మూడో రోజు రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు అంటున్నారు. 
 
కబాలి, వివేగం రికార్డులను ఈ చిత్రం అధిగమించవచ్చునని తెలుస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఇలాగే వసూళ్ల జోరు కొనసాగితే, ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయమనే సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రలను పోషించగా, కాజల్, సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా హీరోయిన్లుగా నటించారు. 
 
ఇదిలా ఉంటే..  ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన చారిత్రాత్మక జీఎస్టీ విధానంపై ఈ సినిమాలో ఉన్న డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మోడీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్న ఆ డైలాగులను సినిమా లో నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ డైలాగులకు సెన్సార్ బోర్డు కట్ చెప్పలేదని.. వ్యవస్థను ప్రశ్నించే అధికారం అందరికీ వుందని.. అందుచేత ఆ డైలాగులను తొలగించాల్సిన పని లేదని సినీ లెజెండ్ కమల్ హాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.