బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:33 IST)

కాసుల వర్షం కురిపిస్తున్న 'జై లవ కుశ' - 'స్పైడర్'

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ", ప్రిన్స్ మహేష్

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ", ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "స్పైడర్" చిత్రాలు రూ.వంద కోట్ల మార్కును ఎపుడో దాటేశాయి. 
 
ముఖ్యంగా, సెప్టెంబర్ 21వ తేదీన ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం విడుదలైంది. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను కొట్టేసింది. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'జై లవ కుశ' రెండో వారానికి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.129 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు.
 
ఇకపోతే.. ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన 'స్పైడర్' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తుంది. సెప్టెంబరు 27న విడుదలైన 'స్పైడర్' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజు రూ.51 కోట్లు వసూలు చేసిన 'స్పైడర్', తనదైన వసూళ్లను రాబడుతున్నది. 'స్పైడర్' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది.