సంబంధిత వార్తలు
- ఓవర్సీస్లో ప్రిన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ... "స్పైడర్ - జై లవ కుశ" కాసుల వర్షం
- తమిళనాడు సీఎం విజయ్ కావాలి : 'స్పైడర్' విలన్ ఆకాంక్ష
- బుద్ధుంటే మళ్లీ ఆ హీరోతో నటించను... రకుల్ ప్రీత్ సింగ్
- మహేష్ బాబు "స్పైడర్" కలెక్షన్ల సునామీ... డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే...
- 'జై లవ కుశ' కంటే 'స్పైడర్'కే భారీ కలెక్షన్లు...
'స్పైడర్' బిజినెస్ రూ.124 కోట్లు.. కలెక్షన్లు రూ.55 కోట్లు... భారీ నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్లు
దసరా పండగకు విడుదలై సందడి చేస్తున్న చిత్రాల్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' ఒకటి. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.124 కోట్ల మేరకు బిజ
దసరా పండగకు విడుదలై సందడి చేస్తున్న చిత్రాల్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' ఒకటి. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.124 కోట్ల మేరకు బిజినెస్ చేసింది. కానీ, కలెక్షన్ల పరంగా తుస్‌మనిపించింది.
భారీ అంచనాల మధ్య విడుదైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత చాలా వేగంగా ఈ సినిమా వసూళ్లు పడిపోతూ వచ్చాయి. దాంతో పంపిణీదారులకు భారీ నష్టాలు తప్పవనేది ట్రేడ్ వర్గాల మాట.
దాదాపు ఈ సినిమా రూ.124 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది. తొలి వారాంతంలో రూ.45 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. రెండోవారం .. మూడోవారంలోనీ కలుపుకుని ఈ సినిమా మరో రూ.10 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అంటున్నారు.
ఆవిధంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.55 కోట్ల షేర్ మాత్రమే ఉండే అవకాశం ఉందనేది ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ. స్టార్ హీరోలకి అప్పుడప్పుడు ఇలాంటి పరాజయాలు ఎదురుకావడం సహజమేననే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
