గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2017 (14:33 IST)

ఆ హీరోయిన్ మారిస్తేనే సినిమా చేస్తా - ప్రిన్స్ కోపం ఎవరిపై..?

స్పైడర్ సినిమాలో నటించిన హీరో మహేష్‌ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. సినిమా విడుదలై భారీ కలెక్షన్లు వస్తున్నా హిట్ టాక్ మాత్రం రాలేదు. మహేష్ లాంటి అగ్ర కథానాయకుడితో నటిస్తే మంచి మైలేజ్ వస్తుందనుకున్న రకుల్‌కు అలా జరగలేదు.

స్పైడర్ సినిమాలో నటించిన హీరో మహేష్‌ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. సినిమా విడుదలై భారీ కలెక్షన్లు వస్తున్నా హిట్ టాక్ మాత్రం రాలేదు. మహేష్ లాంటి అగ్ర కథానాయకుడితో నటిస్తే మంచి మైలేజ్ వస్తుందనుకున్న రకుల్‌కు అలా జరగలేదు. హిట్ల మీద హిట్లతో దూసుకుపోతున్న రకుల్‌కు స్పైడర్ సినిమా బాగా ఇబ్బంది పెట్టింది. దీంతో మహేష్ బాబుతో ఇక నటించనని ఇప్పటికే తేల్చేసింది రకుల్. ఇదే విషయాన్ని స్నేహితులు, సన్నిహితులతో చెప్పడంతో ఆ విషయం కాస్త అలా అలా వైరల్‌గా మారింది.
 
అయితే గత కొన్నిరోజుల ముందు మహేష్‌, రకుల్ కాంబినేషన్ లోనే మరో సినిమా చేయాలని దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్ణయించుకున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్‌లు నిర్మాతలు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభిద్దామని ఇద్దరిని కలిశారు డైరెక్టర్. అయితే మహేష్ బాబు హీరోయిన్‌ను మార్చాలని డైరెక్టర్‌ను కోరారట. రకుల్ ప్రీత్ సింగ్ అయితే తాను నటించనని తేల్చిచెప్పేశాడట. 
 
స్పైడర్ సినిమా తరువాత తన గురించి రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న ప్రచారం గురించి దర్శకుడు వంశీ దృష్టికి తీసుకెళ్ళాడట మహేష్. దీంతో నిర్ణయాన్ని మార్చుకున్న వంశీ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఒకే చేసేశారట. పూజా హెగ్డే అయితే మీకు ఇబ్బంది లేదు కదా అని మహేష్‌ను ప్రశ్నిస్తే రకుల్ తప్ప ఇంకెవరితోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని మహేష్ చెప్పాడట.