1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (11:35 IST)

విలనిజంలో నన్ను మించినోడు లేడంటున్న ఎస్.జే.సూర్య

తెలుగు.. తమిళ భాషల్లో దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న ఎస్.జె. సూర్య, ఆ తర్వాత నటనకి ప్రాధాన్యతనిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'స్పైడర్' సినిమాలో శాడిస్ట్ విలన్‌గా చేశాడు.

తెలుగు.. తమిళ భాషల్లో దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న ఎస్.జె. సూర్య, ఆ తర్వాత నటనకి ప్రాధాన్యతనిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'స్పైడర్' సినిమాలో శాడిస్ట్ విలన్‌గా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆయన నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆయన విలన్‌గా నటంచిన 'మెర్సెల్' కూడా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
ఈ సినిమాలో విలన్‌గా ఆయన చూపిన నటనకు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. విలన్ పాత్రను ఆయన ఈ రేంజ్‌లో చేస్తాడని అనుకోలేదంటూ హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారట. తమిళ చిత్రం అయిన "మెర్సల్‌"లో విజయ్ హీరోగా నటించగా ఎస్.జే. సూర్య ప్రధాన ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో డేనియల్ పాత్రలో క్రూరమైన విలనిజాన్ని సూర్య ప్రదర్శించాడు. తనదైన శైలిలో మరోసారి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. 
 
దక్షిణాదిలో విలనిజం చేయాంటే నన్ను మించినోడు లేడు అనే విధంగా ఎస్.జే.సూర్య ఈ చిత్రంలో కనిపించాడని తమిళ సినీ అభిమానులు చెబుతున్నారు. 'స్పైడర్' తర్వాత ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎస్.జే. సూర్యకు మరింత పేరు తెచ్చిపెడుతుందనేది మాత్రం ముమ్మాటికి నిజమని చెప్పవచ్చు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో ఈ నెల 27న విడుదల కానుందిని తెలుస్తోంది.