మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (10:25 IST)

సక్సెస్ - ఫెయిల్యూర్స్‌తో మాకు పనిలేదు... నటుడు బ్రహ్మాజీ

సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో తమకెలాంటి సంబంధం లేదని, అందువల్ల చిత్రం విడుదల సమయంలో తమపై ఎలాంటి ఒత్తిడి ఉండదని సినీ నటుడు బ్రహ్మాజీ అంటున్నారు. న‌వ‌త‌రం హీరో ఆది సాయికుమార్‌తో కలిసి బ్రహ్మాజీ నటించి

సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో తమకెలాంటి సంబంధం లేదని, అందువల్ల చిత్రం విడుదల సమయంలో తమపై ఎలాంటి ఒత్తిడి ఉండదని సినీ నటుడు బ్రహ్మాజీ అంటున్నారు. న‌వ‌త‌రం హీరో ఆది సాయికుమార్‌తో కలిసి బ్రహ్మాజీ నటించిన తాజా చిత్రం నెక్స్ట్ నువ్వే. వచ్చే నెల మూడో తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో బ్రహ్మాజీ పాల్గొని మాట్లాడుతూ.... 'భరత్‌ అనే నేను', 'రంగస్థలం', 'కృష్ణార్జున యుద్ధం', 'కిరిక్‌ పార్టీ రీమేక్‌ చిత్రం', 'సవ్యసాచి' .. త‌దిత‌ర‌ చిత్రాల్లో నటిస్తున్నాన‌ని తెలిపారు. అలాగే హారర్‌ కామెడీ కథతో తెరకెక్కిన 'నెక్ట్స్‌ నువ్వే' వ‌చ్చే నెల 3న రిలీజ‌వుతుందని చెప్పారు. 
 
ఇకపోతే.. "కెరీర్ ఆరంభంపైకి రావడం కోసం కొన్ని సినిమాలు చేశా. డబ్బు కోసం కొన్ని, పరిచయాల కోసం కొన్ని చేయాల్సొచ్చింద‌ని" అని చెప్పుకొచ్చారు. హీరో లైఫ్‌కి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు లైఫ్‌కి తేడా ఉంటుందన్నారు. హీరో జీవితం సినిమా రిలీజైన ప్ర‌తిసారీ ఒత్తిడికి గురికావల్సిందే. మాపైన అలా జయాపజయాల ప్రభావం అస్సలు ఉండదన్నారు. పైగా ఎక్కువ సినిమాలు చేయొచ్చుని చెప్పుకొచ్చారు.