శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:23 IST)

ప్రేయసిని పెళ్లాడనున్న విరాట్ కోహ్లీ...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డిసెంబరు నెలలో ఓ ఇంటివాడుకానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహమాడనున్నాడు. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్టు సమాచ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డిసెంబరు నెలలో ఓ ఇంటివాడుకానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహమాడనున్నాడు. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్టు సమాచారం. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉంది. 
 
మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండటంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. కోహ్లీ-అనుష్కలు గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. 
 
2013లో జరిగిన ఇంగ్లండ్ టూర్‌లో అనుష్కతో కలిసి కోహ్లీ కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. అయితే 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి. కానీ, అవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయాయి.