మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (15:32 IST)

2019 వరల్డ్ కప్‌లో ధోనీ ఆడుతాడు.. కోహ్లీకి అతడు అవసరం: గంగూలీ

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫిట్‌గా వుంటే 2019 ప్రపంచ కప్‌లో ఆడుతాడని దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ధోనీ అవసరం చాలా ఉందన

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫిట్‌గా వుంటే 2019 ప్రపంచ కప్‌లో ఆడుతాడని దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ధోనీ అవసరం చాలా ఉందన్నాడు. కీపర్‌గానే కాకుండా జట్టు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ధోనీని ఇంకా జట్టులోనే కొనసాగేందుకు ఉపయోగపడుతుందని తెలిపాడు.
 
కెరీర్ ఆరంభంలో అంటే 2004లో చూసిన ధోనీతో ఇప్పటి ధోనీకి ఆటలో పోలికలు చూడవద్దన్నాడు. వయసు పెరిగే కొద్ది ఎవరి ఆటైనా మారుతుందని, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆట కూడా వయసుతో పాటూ మారిందని అన్నాడు. ఫిట్ గా ఉంటే ధోనీ ఆటను వరల్డ్ కప్ లో చూడవచ్చని గుంగూలీ తెలిపాడు. 
 
కోహ్లీ వ్యూరచనలో ధోనీ భాగమవుతున్నాడని, జట్టు విజయాల్లో ధోనీ వ్యూహాలు ఎంతో సాయపడుతున్నాయని గంగూలీ వ్యాఖ్యానించాడు. ధోనీ తప్పకుండా వచ్చే ప్రపంచ  కప్ నాటికి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతాడని.. తద్వారా కోహ్లీకి సాయపడతాడని గంగూలీ అంచనా వేస్తున్నారు.