మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (13:23 IST)

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల యాడ్ అదిరింది.. కెమిస్ట్రీ ఎంత బావుందో (వీడియో)

క్రికెట్- బాలీవుడ్ ప్రేమ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వాణిజ్య ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ‌స్త్రాల బ్రాండ్ కోసం వీరిద్ద‌రూ న‌టించిన‌ ప్ర‌క‌ట‌న అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుక

క్రికెట్- బాలీవుడ్ ప్రేమ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వాణిజ్య ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ‌స్త్రాల బ్రాండ్ కోసం వీరిద్ద‌రూ న‌టించిన‌ ప్ర‌క‌ట‌న అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పెళ్లి జంట చేసుకునే ప్ర‌మాణాల‌ను వీరిద్ద‌రూ చెప్పుకుంటూ, చివ‌రికి విరాట్, అనుష్క‌కు ప్ర‌పోజ్ చేయడం, అందుకు అనుష్క ఓకే చెప్ప‌డం ఈ వీడియోలో కనిపిస్తుంది. 
 
భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో కలిసి.. ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థకు చెందిన ‘మోహే’ బ్రాండ్‌కు అనుష్క ఇటీవల ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఈ బ్రాండ్ కోసం నటించిన ఈ యాడ్ అదుర్స్ అనిపించింది. 
 
ఈ వీడియోలో ఓ పెళ్లి వేడుకకు సంప్రదాయ దుస్తుల్లో హాజరైన కోహ్లీ-అనుష్క జోడీ ఆకట్టుకుంది. సుమారు నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు అనుష్క.. విరాట్ జోడీ మధ్య కెమిస్ట్రీని చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ జంట ఎప్పుడు పెళ్లి పీటలెక్కనుందోనని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి..