మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (14:09 IST)

క్రికెటర్లలో ఏకైక ఆటగాడు... కోహ్లీ బ్రాండ్ విలువ ఎంతో తెలుసా?

విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. బ్రాండ్ విలువలో క్రికెటర్లందరికంటే ముందువరుసలో ఉన్నాడు. తాజాగా ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన టాప్‌-10 అథ్లెట్ల జాబితాలో విర

విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. బ్రాండ్ విలువలో క్రికెటర్లందరికంటే ముందువరుసలో ఉన్నాడు. తాజాగా ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన టాప్‌-10 అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ స్థానం ద‌క్కించుకున్నాడు. 
 
నిజానికి ఈ జాబితాలో టెన్నిస్ క్రీడాకారుడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ మొద‌టిస్థానం ద‌క్కించుకున్నాడు. ఇత‌ని బ్రాండ్ విలువ 37.2 మిలియ‌న్ డాల‌ర్లు. అలాగే, క్రికెటర్లలో టాప్‌-10లో చోటుదక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే. 
 
మొత్తం 14.5 మిలియ‌న్ డాల‌ర్ల బ్రాండ్ విలువ‌తో విరాట్ 7వ స్థానంలో నిలిచాడు. మెస్సీ మాత్రం 13.5 మిలియ‌న్ డాల‌ర్ల‌తో 9వ స్థానంలో ఉన్నాడు. దీన్నిబ‌ట్టి చూస్తే విరాట్ బ్రాండ్ విలువ రోజురోజుకీ పెరుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.
 
ఫెద‌ర‌ర్ త‌ర్వాతి స్థానాల్లో బాస్కెట్ బాల్ ఆట‌గాడు లిబ్రాన్ జేమ్స్‌, స్ప్రింట‌ర్ ఉసేన్ బోల్ట్‌, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డో, గోల్ఫ్ ఆట‌గాళ్లు ఫిల్ మెకెల్‌స‌న్‌, టైగ‌ర్ వుడ్స్ ఉన్నారు. ప్రచారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఫోర్బ్స్‌ పరిగణన‌లోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేసింది.