శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:43 IST)

కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు.. ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు..

వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఆదివారం ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిర

వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఆదివారం ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేగాకుండా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానానికి చేరుకుంది. దీంతో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా కోహ్లీ నిలిచాడు. 
 
తద్వారా మాజీ కెప్టెన్లు ధోనీ, రాహుల్ ద్రవిడ్ సరసన కోహ్లీ నిలిచాడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా నవంబరు 14, 2008 నుంచి ఫిబ్రవరి 5, 2009 వరకు వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది. 2006లో జట్టుకు సారథిగా ఉన్న ద్రావిడ్ కూడా వరుసగా తొమ్మిది మ్యాచుల్లో జట్టును గెలిపించాడు.
 
ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని జట్టు కూడా అదే ఘనతను సాధించింది జూలై 6, 2017 నుంచి సెప్టెంబరు 24, 2017 వరకు వరుసగా 9 వన్డేల్లో జయకేతనం ఎగురవేసింది. తద్వారా వరుసగా అత్యధిక వన్డేలు సాధించిన కెప్టెన్‌గా ధోనీ, రాహుల్ ద్రవిడ్‌లను వెనక్కి నెట్టి.. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
 
ఇకపోతే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. ఇండోర్‌ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో వికెట్ల 5 తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.