గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (18:01 IST)

ఇండోర్ వన్డే: ఫించ్ సెంచరీ... భారత్ టార్గెట్ 294 పరుగులు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తన ప్రత్యర్థి భారత్ ముంగిట 294 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సె

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తన ప్రత్యర్థి భారత్ ముంగిట 294 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులు చేసింది. 
 
ఒక దశలో 300లకు పైగా సునాయాసంగా సాధిస్తుందనుకున్నా.. చివర్లో భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓపెనర్లు ఫించ్, వార్నర్ (42) తొలి వికెట్‌కు 70 పరుగులు, ఫించ్, స్మిత్ రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించి ఆసీస్‌కు మంచి శుభారంభం కల్పించారు. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 రన్స్‌తో మూడొందలకు పైగా స్కోరు ఖాయంగా కనిపించింది. అయితే 224 పరుగుల దగ్గర ఫించ్ ఔటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 243 పరుగుల దగ్గర స్మిత్, మ్యాక్స్‌వెల్ (5) ఔటయ్యారు. 
 
కంగారు బ్యాట్స్‌మెన్లలో వార్నర్ (42), టీఎం హెడ్ (4), హ్యాండ్స్ కోంబ్ (3), ఎంపీ స్టాయినిస్ 27 పరుగులు చేయగా అగర్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు, చాహల్, పాండ్యాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. దీంతో, టీమిండియాకు 294 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు నిర్దేశించింది.