ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (13:41 IST)

ప్రజా సమస్యలపై స్పందించరా? చంద్రబాబు సర్కారు ఏం చేస్తోంది? : పవన్ కళ్యాణ్ (Video)

లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. పైగా, ప

లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. పైగా, ప్రజాసమస్యలు ప్రభుత్వ పరిధిలోకి రావా? అని పవన్ కళ్యాణ్ అడిగారు.
 
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటీకరణ చేయనున్నారన్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఆదివారం జనసేన అధ్యక్షుడు, సినీన‌టుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీసీఐని ప్రైవేటీకరణ బారి నుంచి రక్షించాలని వారు ప్రాదేయపడ్డారు. 
 
విశాఖపట్నం కేంద్రంగా డీసీఐ సేవలు అందిస్తోంది. లాభాల్లో నడుస్తున్న డీసీఐను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద‌రాబాదుకి వ‌చ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో ప‌వ‌న్‌కి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుని, డీసీఐ సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని అన్నారు.
 
ఈ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ... విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని నెరవేర్చక పోగా, లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరణ చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ వైఖరిని కూడా ఆయన తప్పుబట్టారు. 
 
ముఖ్యంగా, ప్ర‌త్యేక హోదా సాధించ‌డంతో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ‌ విధివిధానాలు త‌న‌కు తెలియ‌ట్లేద‌న్నారు. ఇప్పుడు ఈ ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్‌ని ప్రైవేట్ ప‌రం చేస్తోంటే ఏపీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని నిల‌దీశారు. త‌మిళ‌నాడులో ఇటువంటి ప‌నే చేయాల‌ని చూస్తే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ఉద్యోగుల‌కు అండ‌గా నిల‌బ‌డింద‌ని గుర్తు చేశారు. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం ఎందుకు డీసీఐ ఉద్యోగుల ప‌క్షాన నిల‌బ‌డ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అంటే ప్రజాసమస్యలు మీ పరిధిలోకి రావా? అని స‌ర్కారుని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు.