ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (09:07 IST)

బ్యాంకాక్‌లో 'ఇద్దరు భామల'తో పవన్ కళ్యాణ్ ప్రేమాయణం...

హీరో పవన్ కళ్యాణ్ మరో ఇద్దరు భామలతో ప్రేమాయణంలో పడ్డారు. ఒకవైపు ప్రేమ పాఠాలు చదువుతూనే మరోవైపు హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో లీనమైపోయారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, పవన్

హీరో పవన్ కళ్యాణ్ మరో ఇద్దరు భామలతో ప్రేమాయణంలో పడ్డారు. ఒకవైపు ప్రేమ పాఠాలు చదువుతూనే మరోవైపు హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో లీనమైపోయారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్.. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
 
ఒక‌ప్పుడు మన సినిమాల్లో పాటలైనా, ఫైట్స్ అయినా ఇక్కడే తీసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి పాటల కోసం విదేశాలకు వెళ్లడం మొదలైంది. ఫారిన్‌లో అందమైన లొకేషన్స్ మధ్య సాంగ్ షూట్ చేయడం క్రేజీగా మారింది. పాటతో పాటు ఇప్పుడు కొన్ని సినిమాలకు ఫైట్స్ కూడా అక్కడే తీస్తున్నారు. 
 
లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ సినిమా కోసం బ్యాంకాక్‌లో ఫైటింగ్ సీన్స్ తీస్తున్నారట. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కొద్ది రోజులుగా అక్కడే జ‌రుగుతుండ‌గా, ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు మరికొన్ని ప్రేమ సన్నివేశాలను తీస్తున్నారు. 
 
ఈ సినిమాలో మొత్తం ఏడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. వాటిలో హై ఓల్టేజ్‌తో నడిచే యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఇప్పుడు తీస్తున్నది ఒకటని చెబుతున్నారు. ఇక ఇక్క‌డి షెడ్యూల్ పూర్తి కాగానే కొద్ది గ్యాప్ త‌ర్వాత మూవీ యూనిట్ యూరప్ వెడుతుంది. అక్కడ మేజర్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.