శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (10:43 IST)

ఆ సమయంలో నరకయాతన అనుభవించా : శాలినీ పాండే

"అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలినీ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను నరకయాతన అనుభవించినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ముద్దు, రొమాన్స్ సన్నివేశాల్లో తాను తీవ్ర మనోవేదనకుగురై.. చ

"అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలినీ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను నరకయాతన అనుభవించినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ముద్దు, రొమాన్స్ సన్నివేశాల్లో తాను తీవ్ర మనోవేదనకుగురై.. చాలా ఇబ్బందులు పడినట్టు వెల్లడించారు.
 
తాజాగా ఆమె ఓ తమిళ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అనేక అంశాలు వెల్లడించింది. 'అర్జున్ రెడ్డి' సినిమా షూటింగ్ సమయంలో తాను నరకయాతన అనుభవించాను. దీనికి కారణం లేకపోలేదన్నారు. గతంలో తాను కాలేజీ విద్యను అభ్యసిస్తున్నప్పుడు రెండుసార్లు ప్రేమలో పడి విఫలం అయ్యానని, షూటింగ్ సమయంలో అవన్నీ గుర్తుకు వచ్చి లోలోపల కుమిలిపోయానని చెప్పారు. 
 
ముఖ్యంగా, 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో ప్రేమ విఫలమైవున్న తాను హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపిస్తూ, నరకయాతనగా ఉండేదని, అంత బాధలోనే షూటింగ్‌ను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. 
 
తాను సినిమాల్లో అవకాశాల కోసం తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చానని చెప్పిన శాలిని, ముంబైలో తాను పడ్డ అద్దె ఇంటి కష్టాలనూ తెలిపింది. ముంబైలో ఒంటరిగా ఉండే వారికి ఇల్లు ఇవ్వరని, తనతో కలసి మరో అమ్మాయి, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలసి ఓ ఇంట్లో అద్దెకున్నామని, వారు తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని గుర్తుచేసింది. అలా నివశిస్తూ, సినిమాల్లో అవకాశాన్ని సంపాదించినట్టు తెలిపారు.