సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (13:33 IST)

జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి?: పూనమ్ కౌర్

అందాలతార పూనమ్ కౌర్.. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేసి.. కత్తి మహేష్ చేతిలో నానా మాటలనిపించుకుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ.. తన అభిప్రాయాలను నిర్భయంగా బయటికి చెప్పే పూనమ్

అందాలతార పూనమ్ కౌర్.. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేసి.. కత్తి మహేష్ చేతిలో నానా మాటలనిపించుకుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ.. తన అభిప్రాయాలను నిర్భయంగా బయటికి చెప్పే పూనమ్ కౌర్.. తాజాగా సెన్సేషనల్ ట్వీట్స్ చేసింది. ఈ ట్వీట్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
''జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి" అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె తన ట్వీట్‌లో రెండు సినిమా పేర్లను ప్రస్తావనకు తెచ్చారు. ఆ పేర్లను వాడటం ద్వారా ఆ దర్శకుడు పేరును చెప్పకుండా నమ్మకద్రోహి అంటూ చెప్పకనే చెప్పిందా అంటూ చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా ఆ దర్శకుడు ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉండటం.. ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటు. నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి ఓ ఎన్నారై హీరోయిన్‌కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్‌కు హిట్లు ఉన్నాయా? ఆ ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన పనులు బాగా చేస్తారని విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఏ వివాదానికి దారితీస్తుందో వేచి చూడాలి.