శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (18:06 IST)

ఏపీకి ప్రత్యేక హోదా : గంగానది ఒడ్డున పూనమ్ కౌర్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సినీ నటి పూనమ్ కౌర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలను గంగానది ఒడ్డున నిర్వహించారు. రుషికేష్ గంగానది ఒడ్డున ప్రత్యేకంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సినీ నటి పూనమ్ కౌర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలను గంగానది ఒడ్డున నిర్వహించారు. రుషికేష్ గంగానది ఒడ్డున ప్రత్యేకంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కరోలీ బాబా ఆశ్రమంతో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా రావాలని పూనమ్‌ కౌర్ ఇష్టదైవాన్ని ప్రార్థించారు.
 
ఏపీ చేనేతకు బ్రాండ్ అబాసిడర్‌గా వ్యవహారిస్తున్న పూనమ్ కొద్దిరోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును  ఎంతగానో మెచ్చుకున్న విషయం తెల్సిందే. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో విద్యాసంస్థలు తీసుకురావడంతో తనలాంటి వాళ్లు బాగా చదుకున్నారని పూనమ్ చెప్పారు. 
 
ఇకపోతే, నటి శ్రీరెడ్డి ఇష్యూతో టాలీవుడ్‌లో ఓ రకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాస్టింగ్ కౌచ్‌తో సహా మహిళా నటులపై వేధింపులు కూడా హాట్‌టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో పూనమ్ స్టార్ హోదాకు చేరుకోకపోయినా.. గుర్తింపు ఉన్న పాత్రల్లో ఆమె నటించారు. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు.