మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (17:53 IST)

''అభిమన్యుడు'' రిలీజ్‌పై విశాల్ ఏమన్నాడంటే?

విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు

విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తామని తెలిపాడు.


మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. ఇంతలోపు కోలీవుడ్ చిత్రపరిశ్రమలోని సమ్మె కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 
 
ఇక ఈ సినిమా తెలుగు.. తమిళ భాషల్లో వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ తేదీన సినిమాను విడుదల చేయట్లేదని.. సినీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని విశాల్ తెలిపాడు. 
 
అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో విశాల్, సమంత, అర్జున్ సర్జ తదితరులు నటించారు. ఈ సినిమాను విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ అందించారు.