శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 8 మే 2018 (22:19 IST)

మ‌హాన‌టిలో షాలిని పాండే పాత్ర ఇదే..!

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన‌ చిత్రం మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సావిత్రి అభిమానులంతా 'మహానటి' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్త

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన‌ చిత్రం మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సావిత్రి అభిమానులంతా 'మహానటి' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో, అందరిలోనూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో షాలిని పాండే ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. 
 
ఆ పాత్ర ఏమైవుంటుందనేది ఆస‌క్తిగా మారింది. అయితే... సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే కనిపించనుందనేది తాజాగా రిలీజ్ చేసిన వీడియో వలన తెలుస్తోంది. సావిత్రి బాల్యానికి సంబంధించి సుశీల ఒక తీపి జ్ఞాపకమని చెబుతారు. సావిత్రి స్టార్ హీరోయిన్ అయిన తరువాత కూడా సుశీలతో అంతే ఆప్యాయంగా ఉండేవారట. సుశీలను చూడాలనిపించినప్పుడు తాను వెళ్లడమో.. ఆమెను రప్పించుకోవడమో చేసేవారట. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పాత్రలో షాలిని పాండే కనిపించనుందన్నమాట. 
 
మ‌హాన‌టి సినిమాపై బిగినింగ్ నుంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అంచ‌నాలు మ‌రింత పెరిగాయని చెప్ప‌చ్చు. మ‌రి.. మ‌హాన‌టిగా సావిత్రి జీవితం ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి..!