మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (18:00 IST)

''మహానటి''లో దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్‌‌గా ఎవరు నటిస్తున్నారో తెలుసా? (Video)

అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా "ఎవడే సుబ్రహ్మణ్యం'' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన సినిమా ''మహానటి''. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఈ

అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా "ఎవడే సుబ్రహ్మణ్యం'' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన సినిమా ''మహానటి''. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో సినీ యూనిట్‌ బిజీబిజీగా గడుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో సావిత్రి బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య, జర్నలిస్ట్ మధురవాణిగా సమంత, ఫొటోగ్రాఫర్‌ విజయ్‌ ఆంటోనిగా విజయ్‌ దేవరకొండ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అలనాటి దిగ్గజ దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఆ సినిమా వీడియో రూపంలో విడుదల చేసింది సినీ యూనిట్. ఈ వీడియోలో ఎల్వీ ప్రసాద్‌ రోల్‌లో అవసరాల శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. 
 
మహానటుడు ఎన్టీఆర్‌ని తెలుగు చిత్ర సీమకు అందించిన ఎల్వీ ప్రసాద్‌ను ఈ వీడియోలో అద్భుతంగా చూపెట్టారు. మహానటి సావిత్రిని పెళ్లి చేసి చూడు సినిమాతో పరిచయం చేసి.. మిస్సమ్మగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిపేసిన ఎల్వీ ప్రసాద్ లుక్ ''మహానటి'' చిత్రంలో ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి. ఇక కేవీ రెడ్డిగా మహానటిలో దర్శకుడు క్రిష్ నటిస్తున్నారు.