శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2017 (18:16 IST)

నిర్మాతగా మారిన నాని.. చేప పిల్లతో ఈగ సీక్వెల్ తీస్తాడా..?

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం నిర్మాతగా అవతారం ఎత్తాడు. హీరోగా ఏడాది మూడు సినిమాలు చేస్తూ.. వాటి నుంచి హిట్ టాక్ సంపాదించుకునే నాని.. తాజాగా తాను నిర్మిస్తున్న తొలి సినిమా టైటిల్, ఫస్ట్ ల

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం నిర్మాతగా అవతారం ఎత్తాడు. హీరోగా ఏడాది మూడు సినిమాలు చేస్తూ.. వాటి నుంచి హిట్ టాక్ సంపాదించుకునే నాని.. తాజాగా తాను నిర్మిస్తున్న తొలి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. ఆ సినిమా టైటిల్ పేరు.. అ - ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం ట్యాగ్ లైన్ ఉంది. ఇందులో నిత్యమీనన్, శ్రీనివాస అవసరాల, రెజీనా, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇందులో నాని, రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తుండగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాపీ టేబుల్ చూపించాడు. కాఫీలో అ టైటిల్ చూపించాడు. ఆ పక్కనే చక్కెర క్యూబ్స్ ఉన్నాయి. మరోవైపు భగవద్గీత పుస్తకం కనిపిస్తోంది. కింద ఓ వైపు కాగితంలో చుట్టిన గన్ ఉంది. మరోవైపు ఆర్గాన్ డోనర్స్‌కి సంబంధించిన దరఖాస్తు ఉంది. దానిపై రెక్కలు ఊడిపోయిన ఎర్ర గులాబీ రేకలు ఉన్నాయి. 2018 ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నట్లు నాని ప్రకటించాడు. ఈ సినిమా ఈగకు సీక్వెల్‌గా రాబోతుందనే ప్రచారం సాగుతోంది. ఓ చేప పిల్ల ఈ కథకు మూలం అనే టాక్ వినిపిస్తోంది.