శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (16:48 IST)

చిరంజీవి మాట.. అందుకే అదృష్టంగా భావించి నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను..

అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ''ఒక్క క్షణం'' సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా వున్న అల్లు శిరీష్.. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిని తలచుకున్నారు. అభిమానుల పట్ల ఎలా ప

అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ''ఒక్క క్షణం'' సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా వున్న అల్లు శిరీష్.. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిని తలచుకున్నారు. అభిమానుల పట్ల ఎలా ప్రవర్తించాలో చిరంజీవి తమకు చెప్పారన్నారు. కోపంగా, బాధగా వున్నప్పుడు ఎవరైనా సెల్ఫీ తీసుకునేందుకు మీ వద్దకు వస్తే ఏం చేస్తారు..? అన్న ప్రశ్నకు కూడా శిరీష్ బదులిచ్చారు. 
 
ఒకసారి చిరంజీవి గారు తనకో మంచి మాట చెప్పారని అల్లు శిరీష్ అన్నారు. హీరో అయ్యాక తనను చాలామంది కలుస్తుంటారని.. ఆ తర్వాత వాళ్లెవ్వరూ నీకు గుర్తుండకపోవచ్చు. అయితే అవతల వ్యక్తికి నిన్ను కలిసే అవకాశం రాకపోవచ్చు.
 
అందుచేత ఎలాంటి మూడ్‌లో ఉన్నా ఆ అభిమాని కోసం అవన్నీ కాసేపు పక్కన పెట్టేసేయ్ అన్నారని అల్లు శిరీష్ చెప్పారు. అలాచేస్తే ఆ అభిమానికి అది తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చిరంజీవి తెలిపినట్లు శిరీష్ తెలిపారు. ఆ మాటలు ఆలోచింపజేశాయని.. తనను మార్చేశాయని.. అందుకే ఎవరైనా సెల్ఫీ అడిగితే అదృష్టంగా భావించి.. నవ్వుతూ సెల్ఫీ ఇస్తానని అల్లు శిరీష్ వెల్లడించారు.